నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య..

23
- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారం పర్వం ఉపందుకుంది. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామ‌ని తెలిపారు. ప‌ట్ట‌ణంలో తాగునీటి స‌మ‌స్య‌ను తీర్చ‌డంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, క‌ల్వ‌ర్టులను నిర్మించిన‌ట్లు పేర్కొన్నారు. ఈసారి కూడా భారీ మెజారిటీతో త‌న‌ను గెలిపించాల‌ని కోరారు.

ఇక కుప్పంలో టీడీపీ అధినేత‌, చంద్ర‌బాబు త‌ర‌ఫున ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కుప్పంలో రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆమె అంద‌జేశారు. నామినేష‌న్ దాఖ‌లుకు ముందు ఆల‌యం, మ‌సీదు, చ‌ర్చిలో నామినేష‌న్ ప‌త్రాలతో ప్ర‌త్యేక పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేశారు.

Also Read:కేసీఆర్ బస్సుయాత్ర..ఈసీని కలిసిన కేతిరెడ్డి

- Advertisement -