మామ ఎక్ పెగ్ లా…అన్న బాలకృష్ణ…!

196
Nandamuri Lion takes beer
- Advertisement -

నా పేరు తేడా.. దిమాక్‌ థోడా.. చాలా తేడా.. అంటూ  పైసా వసూల్‌ సినిమాలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్‌ అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య  చెప్పిన డైలాగ్‌లకు అభిమానులు ఫిదా కాగా సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు బాలయ్య తేడా..తేడా సింగే అంటూ కామెంట్లు పోస్టు  చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే…తాజాగా బాలయ్య  బీర్‌ కొడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో బాలయ్య ఓ హోటల్‌లో ఒంటరిగా కూర్చొని బీర్‌ తాగుతు కనిపించారు.   ఈ వీడియో ఏ సందర్భంలో, ఎక్కడ తీశారో తెలియడం లేదు గాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.

ఇక ప్రస్తుతం బాలయ్య  తన 102వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జై సింహా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్నారు. హరిప్రియ, నటాషాదోషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  దీని తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నారు బాలయ్య. ఈ చిత్రానికి బాలయ్యే నిర్మాతగా వ్యవహరించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

https://youtu.be/O8GKiTvPNIM

- Advertisement -