రెమ్యునరేషన్‌ పెంచిన బాలకృష్ణ..!

567
balakrishna
- Advertisement -

కేఏస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం రూలర్. ఈ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్ చేస్తుండగా ఇప్పటికే విడుదలైన గెటప్‌లకు మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన కధానాయకుడు,మహానాయకుడు మూవీల తర్వాత తన రెమ్యునరేషన్ ని హైక్ చేశాడట బాలయ్య.

ప్రస్తుతంఈ వార్త టీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుంటు న్న బాలయ్య దీనిని డబుల్ చేసి రూ. 10 కోట్లకు పెంచాడట.ఇక ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కేఎస్ రవికుమార్.

ఎందుకంటే సంక్రాంతి బరిలో ఇప్పటికే మహేష్ హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరుతో పాటు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో,రజనీకాంత్ దర్బార్ కూడా విడుదల కానుండటంతో పెద్దసినిమాల మధ్య పోటీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట.

- Advertisement -