మహానటుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. ఈచిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తూ, ఈసినిమాలో నటిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈసినిమాకు డైరెక్టర్ లేక సినిమా ఎక్కడ ఆగిపోతుందో అనుకున్నారు నందమూరి అభిమానులు. ఇప్పుడు ఈసినిమాకు డైరెక్టర్ గా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ బాధ్యతలు వహించనున్నాడు. ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నాడని ప్రకటించడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు అంచనాలు పెరిగాయి. .
ఇక బాలకృష్ణకు మొదటి నుంచి కూడా సంక్రాంతి కి సినిమా రిలీజ్ చేయడం సెంటిమెంట్ ఉంది. సాధ్యమైనంత వరకూ తన సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్ చేశారు. అలా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చాలా వరకూ బాలకృష్ణకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఇదే సెంటిమెంట్ తో తన తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ సినిమాను కూడా ఈసంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు బాలకృష్ణ.
బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకందో మనకు తెలిసిందే. ఇదే సెంటిమెంట్ ను ఈసారి కూడా ప్రయోగించబోతున్నాడు బాలకృష్ణ. త్వరలో ఈసినిమాకు కావల్సిన నటినటుల ఎంపీక జరుగుతుందన్నారు దర్శకుడు క్రిష్. సాధ్యమైనంత త్వరగా ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తామన్నారు. మొత్తం మీద తనకు సెంటిమెంట్ పండగ రోజు ఎన్టీఆర్ సినిమాను బరిలోకి తీసుకురానున్నాడు బాలకృష్ణ. ఇంతవరకూ దర్వకుడు క్రిష్ చేసిన సినిమాలు మంచి హిట్ సాధించడేమే కాకుండా పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్ సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంటుందో చూడాలి.