మాస్ సాంగ్ తో వస్తున్న బాలయ్య

65
- Advertisement -

వీర సింహా రెడ్డి నుండి ఇప్పటికే మూడు సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటిగా రిలీజైన జై బాలయ్య సాంగ్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రెండో సాంగ్ సుగుణా సుందరి , మూడో సాంగ్ మా బావ మనోభావల్ దెబ్బతిన్నాయి సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

తాజాగా ఆల్బమ్ నుండి రాబోతున్న నాలుగో సాంగ్ ‘మాస్ మొగుడు’ అంటూ ఎనౌన్స్ చేశారు. బాలయ్య -శృతి హాసన్ ఆకట్టుకునే స్టిల్ తో పోస్టర్ సాంగ్ పోస్టర్ ఎట్రాక్ట్ చేస్తుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ తో బాలయ్య సినిమాపై మరిన్ని అంచనాలు పెంచడం ఖాయమని అంటున్నారు. రేపు రాత్రి 7 :55 సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ కానుంది.

ఇప్పటికే మా భావ మనోభావాల్ సాంగ్ లో సోడా బండి మీద డాన్స్ తో ఒక ఊపు ఊపుతున్న బాలయ్య ఈ మాస్ సాంగ్ లో ఎలాంటి స్టెప్స్ వేశాడా ? అని ఫ్యాన్స్ తో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -