ఈసారి బాలయ్యే ముందు

206
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలయ్య ఇద్దరూ తమ యాక్షన్ సినిమాలతో వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య సాంగ్స్ పోటీ కూడా ఉంది. వాల్తేరు వీరయ్య నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యకే బాలయ్య వీర సింహా రెడ్డి ఫస్ట్ సింగిల్ వచ్చింది. అంటే ఫస్ట్ సింగిల్ ఫస్ట్ అనిపించుకున్నాడు చిరు.

ఇప్పుడు రెండు సినిమాల్లో సెకండ్ లిరికల్ సాంగ్ రాబోతుంది. ఈసారి చిరు కంటే ముందే ఉన్నాడు బాలయ్య. అవును వీర సింహా రెడ్డి నుండి సుగుణ సుందరి అనే డ్యూయెట్ సాంగ్ రేపు రిలీజ్ అవ్వబోతుంది. వాల్తేరు వీరయ్య నుండి ఇంకా సెకండ్ లిరికల్ సాంగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. రెండో సాంగ్ గా ఏది వదలలా ? అనే డైలమాలో ఉన్నారు మేకర్స్.

ఏదేమైనా బాలయ్య సాంగ్ తో పోలిస్తే చిరు సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈసారి సెకండ్ సింగిల్ విషయంలో ఎవరు పై చేయి సాదిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -