బాలయ్య – కళ్యాణ్.. సెట్ అవుతుందా

43
- Advertisement -

అఖండ, వీరసింహ రెడ్డి సినిమాల తరువాత బాలయ్యకి ఫుల్ క్లారిటీ వచ్చేసినట్లుంది. జ‌నాలు తనను ఎలా చూడాలి అని అనుకుంటున్నారో.. అలానే తాను సినిమాలు చేయాలి తప్ప, తన ఇమేజ్ దాటి ప్రయోగాలు చేస్తే నడవదని బాలయ్యకి తెలిసి వచ్చినట్లుంది. ఆ సంగతి ఎలా వున్నా, బాలయ్య తన కొత్త సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. నిజంగానే చాలా గ్యాప్ తర్వాత బాలయ్యకి ఇప్పుడు టైమ్ వచ్చింది. పైగా బాలయ్య టైమ్ ఇప్పుడు బాగుంది.

అందుకే కొత్త సినిమాల మీద బాలయ్య దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు మాస్ డైరక్టర్లతో చాలా కాలంగా టచ్ లో వున్నారు. వారు చెప్పిన ఐడియాలు విని వున్నారు. కానీ ఏదీ కాంక్రీట్ గా ఓకే కాలేదు. అనిల్ రావిపూడి సినిమా అయ్యాక, మళ్లీ బోయపాటితో అఖండ 2 ఉంటుంది. ఈ సినిమా ఎవరితో చేయాలి ? ఇదే ఇప్పుడు బాలయ్య ముందు ఉన్న ప్రశ్న. పూరి జగన్నాథ్ రీసెంట్ గా బాలయ్యకి ఒక కథ చెప్పాడు.

Also Read: మే 26న మళ్లీ పెళ్లి విడుదల

బాలయ్యకి కథ పెద్దగా ఎక్కలేదు అని టాక్. సరైన కథ దొరికే వరకు ఓకే చెప్పకూడదు అనే ఆలోచనలో బాలయ్య ఉన్నారు. కాబట్టి.. అఖండ 2 తర్వాత పూరితో సినిమా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ మధ్యలో నిర్మాత సి కళ్యాణ్, బాలయ్య డేట్లు కోసం తిరుగుతున్నాడు. బాలయ్య ప్లాప్ ల్లో ఉన్నప్పుడు సి కళ్యాణ్ రెండు సినిమాలు చేశాడు. ఆ సినిమాలతో కళ్యాణ్ నష్టపోయాడు కూడా. కాబట్టి.. సి కళ్యాణ్ మంచి దర్శకుడితో వెళ్తే.. బాలయ్య డేట్స్ కచ్చితంగా ఇస్తాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: తమిళనటుడు మనోబాల ఇకలేరు..!

- Advertisement -