బాలయ్య బర్త్ డే..BB4 అనౌన్స్

8
- Advertisement -

టాలీవుడ్‌ హిట్ కాంబినేషన్స్‌లో ఒకటి బోయపాటి శ్రీనివాస్ – బాలకృష్ణ. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా,లెజెండ్,అఖండ బ్లాక్ బాస్టర్‌ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీరిద్దరి కాంబో మరోసారి రానుంది.

ఇవాళ బాలయ్య బర్త్ డే సందర్భంగా BB4 మూవీని అనౌన్స్‌ చేశారు. 14 రీల్స్ ప్లస్‌ బ్యానర్‌లో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు బోయపాటి-బాలయ్య బీబీ4 కోసం మళ్లీ కలుస్తున్నారు.. అంటూ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ రిలీజ్ చేశారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

https://x.com/14ReelsPlus/status/1799999422467854426?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1799999422467854426%7Ctwgr%5E84b86f998b7e14584f5ba95bdbcb2cfa122b40d0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fnandamuri-balakrishna-birthday-special-bb4-announcement-1616563

Also Read:శివకార్తికేయన్‌కు విలన్‌గా విద్యుత్‌ జమ్వాల్‌

- Advertisement -