బాలయ్య సినిమా వర్కౌట్ అవుతుందా?

28
- Advertisement -

బాలయ్య బాబు, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త సినిమా పై అప్పుడే అనుమానాలు పెరిగిపోయాయి. బాలయ్య సరసన నాయికగా త్రిష నటిస్తుండగా, రమ్యకృష్ణ మరో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది పొలిటికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. ప్రజా నాయకుడిగా సంజయ్ దత్ కనిపిస్తుండగా.. ఆయనకు అండగా నిలుస్తూ, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళే మిస్సైల్ పాత్రలో బాలయ్య కనిపిస్తున్నారు. ఒక విధంగా సలార్ కథకు దగ్గరగా ఈ సినిమా కథ ఉంటుందట.

మరి ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఈ పొలిటికల్ డ్రామాలో ఎలాంటి కమర్షియల్ అంశాలు పెట్టారు అనేది డౌటే. బాలయ్య మేకోవర్, యాక్షన్ బాగానే ఉన్నా.. కంటెంట్ లో కూడా క్వాలిటీ ఉండాలి. ఇప్పటికే, రెగ్యులర్ యాక్షన్ డ్రామాల పై జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తేనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది. దీనికితోడు బాలయ్య మాస్ సినిమాలకు క్లాస్ ఆడియన్స్ దూరంగా ఉంటారు.

మరి ఈ కొత్త పొలిటికల్ థిల్లర్ తో బాలయ్య ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇంతకీ, బాలయ్యకి పొలిటికల్ థ్రిల్లర్ వర్కౌట్ అవుతుందా ? అనేది కూడా క్వశ్చనే. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిర్మాత నాగవంశీ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి.

Also Read:అబద్ధాల ముందు ‘అభివృద్ధి డీలా’ !

- Advertisement -