బాలయ్యతో ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు 

58
- Advertisement -
బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో  ఓ సినిమా రాబోతుంది. బాబీ, బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క‌థ రెడీ చేశాడు. అయితే.. ఎంత స‌డ‌న్ గా  ఈ ప్రాజెక్టు బ‌య‌ట‌కు వ‌చ్చిందో, అంతే స‌డ‌న్ గా బ్రేకులు పడ్డాయి అని టాక్ ఉంది. బాలయ్య మిగిలిన పర్సనల్ అండ్ రాజకీయ పనుల్లో బిజీ అయిపోవ‌డం వ‌ల్ల,  బాబీ సినిమాని ప‌ట్టించుకోవడం లేదు అని అంటున్నారు. అదే స‌మ‌యంలో బాబీకి రవితేజతో సినిమా చేసే ఆఫ‌ర్ వ‌చ్చింది. కాబ‌ట్టి.. బాబీ అటు వెళ్లిపోయాడు అని రూమర్లు వినిపించాయి. అయితే, ఈ పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదు. బాలయ్య – బాబీ సినిమా రాబోతుంది.
ఈ కాంబోలో సినిమా లేద‌నుకొనుకునే వాళ్ళకు  ఓ అప్ డేట్ ఏమిటంటే.. వచ్చే వారం నుంచి స‌డ‌న్‌గా.. ఈ ప్రాజెక్టు `ఆన్`లోకి రాబోతుంది. ‘బాలయ్య సినిమా’ని వచ్చే వారం నుంచి బాబీ ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈ మేర‌కు బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. బాలయ్య ప్ర‌స్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ కావడంతో.. బాలయ్య ఇక మళ్లీ సినిమాలపై  ఫోకస్ పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబీ సినిమా షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అన్నట్టు  ఈ సినిమా బాలయ్య టైప్ ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని తెలుస్తోంది.
ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే యాక్షన్ సినిమా అట. అంటే.. యాక్షన్ కన్నా.. ఫ్యామిలీ ఎమోషన్సే సినిమాలో ఎక్కువ ఉంటాయట. హిందీ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఒక విలన్. మరో విలన్ కూడా వుంటారు.  వరుస సినిమాల హడావుడి నుంచి చిన్న చిన్నగా బయటపడుతున్న థమన్  ఇప్పుడు బాలయ్య – బాబీ  సినిమాకు స్వరాలు తయారుచేసే పనిలో పడ్డారు.  ఈ సినిమా ఆడియో మీద చాలా భారీ అంచనాలు వున్నాయి. కారణం బాలయ్య – థమన్ కాంబినేషనే.   మరి థమన్ ఎలా ఇస్తాడో చూడాలి.
- Advertisement -