మోడీ నమ్మకద్రోహి..బాలయ్య ఫైర్

313
Balakrishna Blasts Modi
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షలో మాట్లాడిన బాలయ్య చిల్లర రాజకీయాలు,కుప్పిగంతులు మానేయాలని మోడీకి సూచించారు.ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి… నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్ లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ విరుచుకుపడ్డారు. మా ఆంధ్రప్రదేశ్ మీ గుజరాత్ కాదు… మీ పెత్తనం ఇక్కడ కొనసాగదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balakrishna Blasts Modi

అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోదీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ… మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో గౌతమీపుత్ర శాతకర్ణిలా మోడీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవని… వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు.

ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా మోడీపై వ్యతిరేకత ఉందన్నారు. అశాస్త్రీయంగా జరిగిన విభజనతో దిక్కులేకుండా పోయిన ఏపీని చంద్రబాబు ఒక్కరే ఉద్ధరిస్తాని జనం టీడీపీని గెలిపించారని బాలకృష్ణ చెప్పారు.మరోవైపు బాలయ్య ఆవేశంగా మాట్లాడుతున్నంత సేపు చంద్రబాబు నవ్వుతూ కనిపించడం విశేషం.

- Advertisement -