అసిస్టెంట్ ను కొట్టిన బాలయ్య

202
balakrishna
- Advertisement -

టాలీవుడ్ హీరోల్లో బాలయ్య బాబు తరహానే వేరు సినిమాల్లో ఎంత రౌద్రాన్ని ప్రదర్శిస్తారో  బయట మాత్రం చాలా ఫ్రెండ్లిగా ఉంటాడు అంటూ చెప్తూంటారు ఆయన తో పని చేసిన వాళ్ళంతా. కానీ బయట కనిపించే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుంది. నందమూరి నట సింహం విశ్వరూపం స్క్రీన్ పైనే కాదు.. బయట కూడా కనిపించింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు.  సాధారణంగా బాలయ్య బాబుకు కోపం ఎక్కువని ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లూ చెబితే వినటమేగానీ.. ఇప్పుడు మాత్రం అందరికీ చూపించేశారు నందమూరి బాలకృష్ణ.

102వ మూవీకి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరిగింది. దేవుడికి పూజ చేయటానికి రెడీ అయ్యారు హీరో. ఇక్కడే అందరికీ దొరికిపోయారు.చిత్ర పూజా కార్య‌క్ర‌మంలో భాగంగా ఈవెంట్ కి వ‌చ్చిన సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా దేవుని చిత్ర‌ ప‌టాల‌కు కొబ్బరి కాయ‌లు కొట్టారు. బాల‌య్య కూడా త‌న షూస్ విప్పి దేవుని ప‌టాల ద‌గ్గ‌ర కొబ్బ‌రి కాయ కొట్ట‌డానికి వెళ్ళే ముందు త‌న అసిస్టెంట్ త‌లపై మొట్టి షూస్ తీయ‌మ‌ని అన్నాడు. ఆయ‌న చేసిన ఈ చిలిపి ప‌నిని కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార్చారు.

హీరో అయితే కొడతాడా.. అసిస్టెంట్లను బాలయ్య ఇలా కొడతారా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసిస్టెంట్ పై చేయి చేసుకున్న బాలయ్య విజువల్స్ ఇప్పుడు వైరల్ అయ్యింది.కేఎస్ ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న బాల‌య్య 102వ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నారు. న‌య‌న‌తార ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. బాల‌య్య 101వ చిత్రం పైసా వ‌సూల్ నిన్న‌టితో చిత్ర షూటింగ్ పూర్తి చేసుకోగా, సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

https://youtu.be/VgIu5fGy7hE

- Advertisement -