కంట్రోల్‌ బాలయ్య.. కంట్రోల్‌

191
Balakrishna Beat His Assistant On New Movie Set
- Advertisement -

టాలీవుడ్ హీరోల్లో బాలయ్య బాబు తరహానే వేరు సినిమాల్లో ఎంత రౌద్రాన్ని ప్రదర్శిస్తారో బయట మాత్రం చాలా ఫ్రెండ్లిగా ఉంటాడు అంటూ చెప్తూంటారు ఆయన తో పని చేసిన వాళ్ళంతా. కానీ బయట కనిపించే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుంది. నందమూరి నట సింహం విశ్వరూపం స్క్రీన్ పైనే కాదు.. బయట కూడా కనిపించింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ.. అతడితో బూట్లు విప్పించుకుంటు కెమెరాల కంటపడ్డారు. సాధారణంగా బాలయ్య బాబుకు కోపం ఎక్కువని ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లూ చెబితే వినటమేగానీ.. ఇప్పుడు మాత్రం అందరికీ చూపించేశారు బాలకృష్ణ. అంతే కాదు ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. నేషనల్ మీడియాలో సైతం దీనిపై వార్తలు నడుస్తున్నాయి. ఒక నేషనల్ ఛానెల్ బాలయ్య ప్రవర్తనపై చిన్న స్టోరీనే నడిపించేసింది.

Balakrishna Beat His Assistant On New Movie Set

అయితే ఇంతకుముందు బాలయ్య ఓ స్టేజ్ మీద అమ్మాయిలపై వల్గర్ కామెంట్స్ చేయడాన్ని.. గతంలో అభిమానులతో అనుచితంగా ప్రవర్తించడాన్ని ఉటంకిస్తూ.. ప్రస్తుత ఘటనను మళ్లీ మళ్లీ చూపిస్తూ బాలయ్యను తప్పుబట్టే ప్రయత్నం చేసింది. సంఘటన జరిగిన రోజు పలు నేషనల్ వెబ్ సైట్లలోనూ దీనిపై వార్తలొచ్చాయి. తర్వాత టీవీ ఛానెళ్లలోనూ రచ్చ మొదలైంది. సౌత్ ఇండియాలో ఉన్న అన్ని మీడియాల్లోనూ దీనిపై వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు కావడంతో తమిళ మీడియా ఈ సంఘటనకు వార్తల్లో బాగానే ప్రయారిటీ ఇచ్చింది. మొత్తానికి అసిస్టెంట్‌ను కొట్టిన ఎపిసోడ్ తో బాలయ్యకు నెగెటివ్ పబ్లిసిటీ మాత్రం బాగానే వచ్చింది. కాగా బాలయ్య ప్రవర్తనపై కొంత‌మంది అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలా ఆగ్ర‌హానికి గురైన ఓ అభిమాని బాల‌కృష్ణ‌కు లేఖ కూడా రాశాడు.

ఆ అభిమాని లేఖలో రాసిన విషయం ఏంటంటే…`అన్నా… రెండు గ్రాముల సంస్కారం కావాల‌న్నా!` అనే టైటిల్‌తో ఉన్న ఈ లేఖ‌లో వివిధ సంద‌ర్భాల్లో ఆయ‌న అనుచిత ప్ర‌వ‌ర్త‌నను విమ‌ర్శిస్తూ, ప్రేక్ష‌కుల విలువ‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు వివ‌రించాడు. దొర‌లు, రాజుల కాలం పోయింద‌ని, ప్రేక్ష‌కుడి టికెట్ డ‌బ్బుల మీద బ‌తికే మీరు దొర‌ల్లా ఫీల్ అవ‌కండ‌ని లేఖ‌లో ఉంది. ప్రేక్ష‌కులు దేవుళ్ల‌తో స‌మాన‌మ‌ని ఊరికే అన‌లేద‌ని, మీ సినిమాని ప్రేక్ష‌కులు బ‌హిష్క‌రిస్తే వీఐపీలో ఒక్క అక్ష‌రం మిస్స‌య్యే ప‌రిస్థితి మీకు వ‌స్తుంద‌ని అభిమాని లేఖ‌లో విమ‌ర్శించాడు.

https://youtu.be/gz7s1Jq8UGk

- Advertisement -