బాలయ్య బీబీ3 యానిమేటెడ్ టీజర్..!

233
BB3 Animated Teaser
- Advertisement -

నట సింహం నందమూరి బాలకృష్ణ, పవర్‌ఫుల్‌ దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో తాజాగా బీబీ3 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహ, లెజండ్ సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

ఇక తాజాగా బీబీ3 యానిమేటెడ్ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఎస్ఆర్ఏ1 ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ యానిమేషన్ టీజర్‌ను రూపొందించగా.. ఇది అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -