అభిమానిపై బాలయ్య దాడి..వీడియో వైరల్‌..!

494
balakrishna fan
- Advertisement -

ఇప్పటివరకు తన నోటి దురుసుతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఈసారి ఫ్యాన్‌ని తరిమికొడుతూ వార్తల్లో నిలిచారు. సినిమా షూటింగ్‌ని తలపించేలా నడిరోడ్డుపై ఓ అభిమానిని వెంటాడి వేటాడి తరిమికొట్టారు. వైసీపీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య.. నడిరోడ్డుపై అందరూ చేస్తుండగానే.. ఓ యువకుడి మీద దాడి చేశారు. బాలయ్య వెంటపడుతుంటే, ఆ యువకుడు పరిగెత్తాడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

బాలయ్య అభిమానులపై దాడి చేయడం ఇదే తొలిసారి కాదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అభిమానిపై బాలయ్య దాడి చేశారు. ఇటీవలే హిందూపురంలో ప్రచారం నిర్వహించిన బాలయ్య వీడియో జర్నలిస్ట్‌ను బెదిరించారు. తాజాగా ఓ ఫ్యాన్‌ను వెంటాడి తరిమిన బాలయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.

బాలయ్య ఫ్యాన్‌పై దాడిచేయడాన్ని తప్పుబట్టింది వైసీపీ. ఛీ..ఛీ.. వీళ్లు నాయకులా? ఇలాంటి వాళ్లను మళ్లీ ఎన్నుకోవాలా? అంటూ ప్రశ్నించింది.

- Advertisement -