బాలయ్యకి పొలిటికల్ డ్రామాలు బాగా కలిసొచ్చాయి. ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాల్లో రాజకీయ కోణాలు ఉంటాయి. ముఖ్యంగా లెజెండ్, సింహా వంటి చిత్రాల్లో ఆ కోణాలు అయితే మరీ ఎక్కువ. ఇక అఖండలో కూడా బోలెడు పొలిటికల్ సెటైర్లు ఉన్నాయి. పైగా ఈ మూడు ఓరకంగా పొలిటికల్ హిట్లే. ఇప్పుడు అనిల్ రావిపూడి తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. మొదట్లో ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ గుసగుసలు వినిపించాయి.
కానీ, అనిల్ రావిపూడి కూడా పూర్తి స్థాయిలో రాజకీయ నేపథ్యంలోనే ఓ కథ రాశాడని తెలుస్తోంది. ఎలాగూ బాలయ్య కి ఈ తరహా సినిమా చేయడం చాలా సులభం. కానీ, అనిల్ రావిపూడికి ఈ జోనర్ ఇదే తొలిసారి. ప్రస్తుత సమకాలీన రాజకీయాలు, జనం తరచూ మాట్లాడుకొనే రకరకాల రాజకీయ వ్యవహారాలు, సంఘటనలు…. ఇవన్నీఅనిల్ రావిపూడి పూర్తి కామెడీ టోన్ లో చూపించబోతున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య నోట వెంట వచ్చే పొలిటికల్ పంచ్ లు ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయట.
అన్నింటికి మించి ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఓ ప్రత్యేకమైన పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. బాలీవుడ్ ఐటెమ్ సోయగం మలైకా అరోరా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుందని టాక్ కూడా ఉంది. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటాడు. ఈ సినిమాలోనూ కామెడీ సీక్వెన్స్‌లు భారీగా ఉన్నాయి. పైగా, బాలయ్య నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. బడ్జెట్ దాదాపుగా 80 కోట్లకు పైమాటే అని టాక్.
ఇవి కూడా చదవండి..