నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు కొత్తగా తనను తాను మలచుకుంటుంటారు. కుర్రాళ్లకు పోటీగా స్పీడుగా సినిమాలు చేయడం ఆయనకే సాధ్యం. యాక్టింగ్‌లోనూ, డైలాగ్ డెలివరీలోనూ, డ్యాన్స్‌ల్లోనూ ఆయన సరికొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ మధ్య ఆయన పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా బాలయ్య పలు టీవీ చానెల్లకు ఇంటర్య్వులు ఇస్తు సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌కు బాలయ్య ఇంటర్య్వు ఇచ్చారు.
ఈ నేపధ్యంలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు బాలయ్య బదులిచ్చారు.. ఈ సందర్భంగా పెద్ద కుమార్తె బ్రాహ్మణికి సంబంధించి యాంకర్ ఒక ప్రశ్న అడగ్గా.. బ్రాహ్మణి గురించి మీరు ఎం చెప్తారు అనగా ఆవిడ అంటే నాకు పిచ్చ భయం అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఏడాది పాలనపై ఏం చెప్తారని అడగగా… ఫైల్యూర్ అన్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.