బాలయ్య…105 ప్రారంభం

407
balakrishna vinayak
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా మూవీ ప్రారంభమైంది. బాలయ్య 105వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన జై సింహా సూపర్ హిట్ కావడంతో మరోసారి రవికుమార్‌కు ఛాన్స్ ఇచ్చారు బాలకృష్ణ.

సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ముహూర్త‌పు స‌న్నివేశానికి వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్ట‌గా, బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. కోదండ రామిరెడ్డి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

జూలై నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పరుచూరి మురళి కథను అందించగా చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ఇక ఈ సినిమాకు రూలర్ లేదా క్రాంతి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -