నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ముగిసింది.. అరివుమణి-అంబుమణిల సారధ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ లు బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా, హరిప్రియ, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, మురళీ మోహన్, జేపీ, ఎల్బీ శ్రీరామ్‌లతో పాటు ఇతర ప్రధాన తారాగణం కూడా పాలుపంచుకొంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా షూట్ చేయడం జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో ఈ కీలకమైన ఎపిసోడ్ ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నాటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుందన్నారు.
బాలకృష్ణ, నయనతార, నటాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.