నార్త్ లో బాలయ్య… మార్కెట్ పెరగుతుందా ?

158
- Advertisement -

ఇప్పుడు ఒక భాషలో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాను మరో భాషలో వెంటనే రిలీజ్ చేయడం కామన్. అయితే ఏడాది తర్వాత బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా అఖండ హిందీ రిలీజ్ కి రెడీ అయింది. జనవరి 20 న సినిమాను నార్త్ లో పెన్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి.

రీసెంట్ గా డెవోషనల్ టచ్ ఉన్న కాంతర , కార్తికేయ 2 హిందీలో భారీ వసూళ్లు అందుకున్నాయి. ముఖ్యంగా కాంతార అక్కడ 100 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ కి బిగ్ షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య అఖండ కూడా అక్కడ భారీ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. నార్త్ ఆడియన్స్ మెచ్చే అన్నీ అంశాలు ‘అఖండ’లో పుష్కలంగా ఉన్నాయి. మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ , డెవోషనల్ ఎలిమెంట్స్ , అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ కలగలిపిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం పక్కా అనిపిస్తుంది.

ఇక టైమ్ కలిసొస్తే ‘అఖండ’ తో నార్త్ లో బాలయ్య కి భారీ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఖాయం. జనవరిలో బాలయ్య నుండి తెలుగులో వీర సింహా రెడ్డి హిందీ లో అఖండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో బాలయ్య జనవరిలో థియేటర్స్ లో గట్టిగా సందడి చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -