దర్శకుడు అనిల్ రావిపూడి – బాలయ్య బాబును మాస్ అండ్ కామెడీ కింగ్ గా చూపించే పనిలో బిజీగా ఉన్నాడన్నది తెలిసిందే. ఈ ప్రాజెక్టులో బాలయ్య ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి టీం చాలా పేర్లను పరిశీలించి చివరకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదుకానీ -ప్రాజెక్టు నుంచి కాజల్ అగర్వాల్ అకస్మాత్తుగా తప్పుకుంటున్నా అంటూ మెసేజ్ చేసిందట. అయితే ఆ ఇంపాక్ట్ ప్రాజెక్టుపై పడకూడదన్న ఉద్దేశంతో కాజల్ అగర్వాల్ తో నిర్మాతలు మాట్లాడారు.
ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఓకే చెప్పారు. నిజానికి కాజల్ అగర్వాల్ క్రేజ్ టాప్ రేంజ్‌లో లేకున్నా – ఆమెకు రెండు కోట్లు ఇచ్చి మరీ బాలయ్యకు జోడీగా ఎంపిక చేయడం చర్చకు తావిచ్చింది. నిజానికి మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకుంటున్నట్టు మీడియా కథనాలొచ్చినా – త్రిష పారితోషికాన్ని మరీ ఎక్కువ డిమాండ్ చేసింది.
ఆ తర్వాత బాలయ్య ఇమేజ్ వెయిట్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్‌గా నయనతార ను ఎంపిక చేశారన్న కథనాలు లేకపోలేదు. ఇన్ని షార్ప్ టర్న్‌ల తరువాత బాలయ్య – అనిల్ రావిపూడి ప్రాజెక్టు బోర్డ్‌లో కాజల్‌కే ప్లేస్ దక్కింది. మరి బాలయ్య ప్రాజెక్టులో కాజల్ జోడీ కట్టడం ఎంతవరకు కలిసి వస్తోందో చూడాలి.
ఇవి కూడా చదవండి…