అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న NBK 108 సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నెలరోజుల పాటు కంటిన్యూగా షూటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ షెడ్యూల్ లోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ సన్నివేశాలు కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా మూడు గెటప్స్ లో బాలయ్య లుక్ ఉంటుంది. ఐతే, అరవై ఏళ్ల వ్యక్తిగా ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ అరవై ఏళ్ల వ్యక్తి లుక్ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట.
అలాగే మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కూడా బాలయ్య నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో బాలయ్య ఇమేజ్ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం అనిల్ రావిపూడి టీం చాలా పేర్లను పరిశీలించి చివరకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసుకుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. పైగా పెళ్లి అయిన లేడీగా కాజల్ నటిస్తోంది.
బాలయ్య – కాజల్ లవ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంటుందట. ఇద్దరు పెళ్లి అయిపోయి, తమ జీవిత భాగస్వాములను పోగొట్టుకుని.. ఒంటరి జీవితాన్ని లీడ్ చేస్తూ ప్రేమలో పడతారు అని.. వీరి లవ్ ట్రాక్ నుంచి రెండో పెళ్లి వరకూ సాగే సీక్వెన్స్ చాలా ఫన్నీగా ఉంటుంది అని టాక్ నడుస్తోంది. బాలయ్య క్యారెక్టర్ లో కావాల్సిననన్ని వేరియేషన్స్ ను కూడా యాడ్ చేశారు. అందువల్ల పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది అనేది అనిల్ రావిపూడి టీమ్ నమ్మకం. పైగా స్క్రిప్ట్ మొత్తం భారీ యాక్షన్ ఫీస్ట్ అన్నట్లుగా యాక్షన్ సీన్లతో కథను నింపారు.
ఇవి కూడా చదవండి…