మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీకి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో ఉంది. బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి, చిరు ఖైదీ నంబర్ 150 చిత్రాలు రెండు సంక్రాంతి నాడు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పోటిలో ఇద్దరు స్టార్ హీరోలు కాలు దువ్వుతుండగా తాజాగా మరో సీనియర్ హీరో కూడా పోటిలోకి ఎంటర్ అయ్యాడు.
ఇటీవల బాబు బంగారం సినిమాతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సాలాఖద్దూస్కు రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓం నమోవేంకటేశాయ కూడా అదే సమయంలో రిలీజ్ అవుతుందన్న వార్తలు వస్తున్నప్పటీకి అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఒకేసారి రానుండడంతో వచ్చే సంక్రాంతి పోటి మరింత రసవత్తరంగా మారనుంది.
ఇక శాతకర్ణి మూవీతో పోలిస్తే.. చిరు 150 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అంతంత మాత్రంగానే ఉంది. చారిత్రక నేపథ్యం ఉండడం, క్రిష్ మీద నమ్మకంతో బయ్యర్లు శాతకర్ణి సినిమా కొనేందుకు క్యూ కడుతున్నారట. అయితే చిరు సినిమా మార్కేట్లో జోష్ తగ్గడానికి రాంచరణ్ కారణమని తెలుస్తోంది.తండ్రి ఇమేజ్ గురించి కాస్త ఎక్కువగా ఊహించుకుంటున్నాడట ఈ హీరో. అందుకే భారీ మొత్తంలో ఈ చిత్రాన్నీ అమ్మాలని భావిస్తున్నాడట. అయితే బయ్యర్లు మాత్రం చరణ్ చెప్పే రేటు పెట్టి కొనేందుకు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. చిరంజీవికి గతంలో ఉన్నంత ఇమేజ్ లేదని భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.అందుకే ఆ సినిమా అమ్మకాలు కాస్తంత డల్‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది.