‘శ్రీవెంకటేశ్వరస్వామి’ గెటప్స్‌లో బలయ్య..

234
NTR biopic
- Advertisement -

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధానపాత్రధారిగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. ఎన్టీఆర్ సినీ ప్రయాణం ‘కథానాయకుడు’ పేరుతోను .. రాజకీయ ప్రస్థానం ‘మహానాయకుడు’ పేరుతోను ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక .. రానా .. సుమంత్ .. కల్యాణ్ రామ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

NTR biopic

బాలకృష్ణ 64 గెటప్స్‌లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఎన్టీఆర్ తన సుదీర్ఘ నట ప్రయాణంలో వందల కొద్దీ విభిన్న పాత్రలు పోషించారు. వాటిలో రాముడు.. కృష్ణుడు.. దుర్యోధనుడు..కర్ణుడు లాంటి పౌరాణిక పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎవరైనా నటులు అలాంటి పాత్రలు పోషించాలంటే ఎన్టీఆర్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటారు.

తాజాగా ఈ చిత్రం నుండి మరో కొత్త గెటప్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. 1960లో విడుదలైన ‘శ్రీవెంకటేశ్వరస్వామి’ మహత్యం సినిమాలో నటించారు ఎన్టీఆర్‌. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ ఏడుకొండల స్వామిగా నటించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ టీమ్ తాజాగా దీనికి సంబంధించి ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

- Advertisement -