బలగం సినిమాకి ఆస్కార్ వస్తోందని దిల్ రాజు భ్రమలో ఉన్నాడంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ‘బలగం’ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిర్మాత దిల్ రాజు కిందామీదా పడుతున్నాడు. బహుశా “ఆర్ఆర్ఆర్” సినిమా ఆస్కార్ వరకు వెళ్లేసరికి ఇప్పుడు భారతీయ ఫిలిం మేకర్స్, హీరోలందరికీ తమ సినిమాలను కూడా ఆస్కార్ బరిలో నిలపాలనే కోరిక బలంగా పుట్టిన్నట్లు ఉంది. ఒక విధంగా “నాటు నాటు” పాటకు ఆస్కార్ వచ్చేలా రాజమౌళి అండ్ టీం గట్టిగా ప్రోమోట్ చేశారు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు ఆస్కార్ అందుకున్నారు.
అయితే, ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆర్ఆర్ఆర్ అనేది భారీ సినిమా. పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా. తెలుగు సినీ చరిత్రలోనే గొప్ప మల్టీస్టారర్ గా నిలిచిపోయిన సినిమా. కాబట్టి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పోల్చుకోవడం కచ్చితంగా తప్పే. ఆస్కార్ కు వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాలి. ముఖ్యంగా అమెరికాలో స్ట్రీమింగ్ చేయడానికి కొంత బడ్జెట్ అవసరమవుతుంది. ఆ బడ్జెట్ ఎంత ?, ఎవర్నీ అప్రోచ్ అవ్వాలి ?, లాంటి విషయాలను తెలుసుకోవడానికి కూడా అదనపు బడ్జెట్ అవుతుంది. కచ్చితంగా బలగం సినిమాతో ఆస్కార్ కొట్టాలని దిల్ రాజు అనుకుంటే ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు.
Also Read:కళ్యాణ్ రామ్.. ‘డెవిల్’కోసం!
కానీ, పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. బలగం సినిమా ఓ ప్రాంతీయ సినిమా, ముఖ్యంగా ఓ ప్రాంతానికి సంబంధించిన సినిమా. అసలు నార్త్ లోనే బలగం సినిమాని సరిగ్గా పట్టించుకోరు. పాన్ ఇండియా సినిమాగానే దాన్ని పరిగణలోకి తీసుకోరు. అలాంటి సినిమాతో ఆస్కార్ కొట్టాలని దిల్ రాజు ఎలా అనుకున్నాడో ?. ఏది ఏమైనా ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఏ నమ్మకంతో దిల్ రాజు బలగం సినిమాకి ఆస్కార్ రావాలని ఆశ పడుతున్నాడు ?. ఇకపై ప్రతి మసాలా సినిమా తీసే దర్శకుడు “ఆస్కార్” మాట మాట్లాడుతారేమో.
Also Read:టీడీపీలోకి జూ.ఎన్టీఆర్.. కష్టమే ?