Suman:న్యాయస్థానాలపై నమ్మకం ఉంది

13
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా ఇరికించారని…కానీ తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. తీహార్ జైలులో కవితతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన సుమన్…బీజేపీకి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు.

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ఎన్ని కేసులు పెట్టినా.. త‌ల వంచ‌కుండా పోరాటం చేస్తామ‌న్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదు.. అదొక పాలసీ… దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిందని…ఆ పార్టీ 220 సీట్లు దాటదన్నారు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అని …న్యాయం గెలిచి తీరుతుందన్నారు.

Also Read:హిట్ లిస్ట్.. టీజర్ లాంచ్

- Advertisement -