బకాసనం అనేది యోగాలో ఒకవిధమైన ఆసనం.. బకము అనగా కొంగ.. ఈ ఆసనం చూడడానికి నీటిలో నించున్న కొంగను పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి బకాసనం అనే పేరు వచ్చింది. ఈ యొక్క ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల మనశరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా వెన్నెముక కు రక్తప్రసరణ సమృద్దిగా జరుగుతుంది. అందువల్ల వెన్ను నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతే కాకుండా వెన్నెముక మృదువుగాను ధృఢంగాను తయారవుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల కేవలం వెన్నెముక మాత్రమే కాకుండా శరీరంలోని అన్నీ అవయవాలు ఎంతో చురుకుగా పని చేస్తాయి. ఈ ఆసనం వల్ల చేతులు ఎంతో ధృఢంగా తయారవుతాయి. ఉదర కండరాలు కూడా బలపడతాయి. దాంతో జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
Also Read:కూటమి ముగ్గురిది..మేనిఫెస్టో ఇద్దరిది?
బకాసనం వేయు విధానం
ముందుగా బల్లపరుపు నేలపై రిలాక్స్ పొజిషన్ లో కూర్చొని, తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గరకు మడిచి పాదాలను దగ్గరగా ఉంచాలి. ఆ తరువాత చేతులను నేలపై సమాంతరంగా ఉంచుతూ.. శరీర బరువంతా కూడా పిరుడులపై నుంచి చేతులపై మోపి, మోకాళ్ళను చేతుల కిందుగా చంకలకు దగ్గరగా తీసుకురావాలి. ఈ సమయంలో తొడలు పొత్తను అనుకునేలా చేసి కాళ్ళు గాల్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉన్న తరువాత కాళ్ళను గాల్లోనే నెమ్మదిగా ముందుకు చాచుతూ శరీరాన్ని వెనుకకు నెలవైపుకు వంచాలి. కాళ్ళు శరీరం నేలపైనా ఆంచకుండా పిరుదులపైనే బాడీని బ్యాలెన్స్ చేస్తూ పోటోలో చూపిన విధంగా చేయాలి. ఇక కాసేపటి తరువాత మళ్ళీ కాళ్ళను దగ్గరగా ముడుస్తూ మళ్ళీ చాపాలి. ఇలా మొత్తంగా 10-20 సార్లు లేదా సాద్యమైనని సార్లు చేసి రిలాక్స్ పొజిషన్ లోకి రావా