మాజీ మంత్రి నారాయణకు బెయిల్‌..

77
narayana edu
- Advertisement -

మాజీ మంత్రి,నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్‌ లభించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో నారాయణను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా నారాయణకు ఆ విద్యాసంస్థలతో సంబంధం లేదని అతని తరపు న్యాయవాదులు వాదించారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేశారని ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించారు.

దీంతో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. మే 18లోగా ఇద్దరు వ్యక్తులు లక్ష రూపాయల చొప్పున పూచీకత్తు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హై స్కూల్‌ నుంచి తెలుగు క్వశ్చన్ పేపర్ వాట్సప్‌‌లో చక్కర్లు కొట్టింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉందని తేల్చిన చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్ వచ్చి నారాయణను అరెస్ట్ చేశారు.

- Advertisement -