బ్రేకింగ్..MLC కవితకు బెయిల్

11
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. దాదాపు ఐదు నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకురానున్నారు కవిత. బెయిల్‌ పై సుప్రీం కోర్టులో గంటన్నరపాటు వాదానలు సాగాయి. ఈడీ, సీబీఐ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

కవిత బెయిల్‌ పై వాదనలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి చేరుకుని న్యాయవాదులతో చర్చించారు కేటీఆర్, హరీశ్‌ రావు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు కవిత. మార్చి 15న లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిందని అన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు.

Also Read:MLC Patnam: అక్రమమైతే కూల్చండి..హైడ్రా మంచే చేస్తుంది

- Advertisement -