- Advertisement -
జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు స్వల్ప ఊరట లభించింది. మహిళను కిడ్నాప్ చేసి అరెస్ట్ అయిన కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. దీంతో రేవణ్ణ జైలు నుంచి విడుదల అయ్యారు.
ఈ కేసులో సిట్ మే 4న రేవణ్ణను అరెస్టు చేసింది. సిట్ విచారణ అనంతరం రేవణ్ణకు మే 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రేవణ్ణ కుమారుడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన తల్లిని లైంగికంగా వేధించారని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
బెంగళూరులోని కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకే మహిళను రేవణ్ణ కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం పెద్దది కావడంతో ఆయన్ను జేడీఎస్ సస్పెండ్ చేసింది.
Also Read:Akhilesh:బీజేపీ గ్రాఫ్ పతనమవుతోంది
- Advertisement -

