- Advertisement -
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
ఇప్పటికే జానీ మాస్టర్ 14 రోజుల రిమాండ్‌లో పోలీసులు కీలక అంశాలను రాబట్టారు. ఈ కేసులో బాధితురాలిపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందని ఫిర్యాదులో పేర్కొంది.
ఐదేళ్లు నరకం చూపించింది.. నేను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్లిందని వెల్లడించింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకుందని.. జానీ మాస్టర్ తోనే కాదు చాలా మంది మగవాళ్లతో యువతికి సంబంధం ఉందని పేర్కొంది.
Also Read;ప్రజాస్వామ్యం వన్ వే ట్రాఫిక్ కాదు: ఖుష్బూ
- Advertisement -