హమ్మయ్య..ఓ పనైపోయింది

94
prabas

బాహుబలి..తెలుగు ఇండస్ట్ర్రీలో ఓ కొత్త చరిత్రను సృష్టించిన సినిమా. సినిమా అంత అద్భుతంగా రావడానికి రాజమౌళి ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి సిరీస్‌ కోసం ఏకంగా నాలుగు ఏండ్లు కేటాయించాడు. బాహుబలి కోసం మరో సినిమాను ఒప్పుకోలేదు. బాహుబలి కోసం దాదాపు నాలుగేళ్లుగా పనిచేస్తున్న ప్రభాస్కు త్వరలో విముక్తి కలగనుందట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి డిసెంబర్ 27తో షూటింగ్ మొత్తం వర్క్ పూర్తి చేసుకోనుందట. బాహుబలి 2లో నటించిన తోటి నటీనటుల షూటింగ్ ఎప్పుడో పూర్తి అయి పోయినా..ప్రభాస్‌కు ఇంతకు వరకు మోక్షం లభించలేదు. డిసెంబర్‌ 27తో బాహుబలి సిరీస్ షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టనున్నారు. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా మరింత ప్రతిష్టాత్మకంగా బాహుబలి ద కంక్లూజన్ను తెరకెక్కిస్తున్నారు.

prabas

డిసెంబర్ 27 నుంచి షూటింగ్కు ప్యాకప్ చెప్పేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు. ప్రభాస్ కూడా కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. అదే సమయంలో తన పెళ్లి విషయంలో కూడా ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. నాలుగేళ్లుగా బాహుబలి సెట్లో ఉండిపోయిన ప్రభాస్కు త్వరలో విముక్తి లభించనుందన్న వార్తతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.