బాహుబలి కౌంట్ డౌన్ మొదలైంది. మరో ఆరు రోజుల్లో బాహుబలి ది కన్ క్లూజన్ అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో పాల్గొన్న రాజమౌళి ‘బాహుబలి-2: ది కన్ క్లూజన్’ సినిమా విషయంలో వచ్చే రివ్యూల గురించి తనకు బెంగలేదని చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యకాలంలో వచ్చే రివ్యూలను ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారని, అలాగా తన అభిప్రాయం తనదని ఆయన తెలిపారు. రివ్యూలు తనకు అనుకూలంగా రాసేవారంతా మంచివాళ్లు, తనకు వ్యతిరేకంగా రాసేవారంతా తనకు వ్యతిరేకులని ఆయన ప్రకటించారు.
ఇక మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు ఈ దర్శకధీరుడు. ప్రభాస్ అపరిచితుడిలాంటి వాడని సినిమా కోసం ఎంత కష్టపడతాడో అంత బద్దకస్తుడని చెప్పాడు. ఈ సందర్భంగా ఓ సన్నివేశాన్ని ఉదహరించారు. ‘బాహుబలి: ది బిగెనింగ్’ సినిమా విడుదలైన తరువాత ముంబై నుంచి హైదరాబాదు వచ్చేందుకు అంతా సిద్ధమై ముంబై ఎయిర్ పోర్టుకు బయల్దేరాం. ప్రభాస్ అందరికంటే ముందే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు…నిర్మాత శోభు ఫోన్ చేసి, ప్రభాస్ ఎక్కడున్నావు? అని అడిగితే చెక్ ఇన్ పక్కనే ఉన్న లాంజ్ లో ఉన్నానని సమాధానం చెప్పాడు. ఇన్నిసార్లు ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్లినా తాము దానిని గమనించలేదు. అక్కడే తిరుగుతుంటే ప్రభాస్ వచ్చి లాంజ్ లోకి తీసుకెళ్లాడు.
దీంతో అంతా అక్కడికి వెళ్లాం..విమానం బయల్దేరేందుకు ఇంకా 20 నిమిషాలే ఉంది…పద చెకిన్ కి వెళ్దామని నేను తొందరపడితే…టీమ్ మొత్తాన్ని ఆపి…కష్టపడాలంటే రాజమౌళి వెనక వెళ్లండి…కంఫర్ట్ కావాలంటే నా వెనుక రండి అని అన్నాడు. ఇంతలో ఒక అధికారి వచ్చి ఇంకా 15 మంది ఉన్నారని రావచ్చని తెలిపాడు… అప్పుడు ప్రభాస్ లైన్ లో ఐదుగురు ఉన్నప్పుడు చెప్పండి…అని అతనిని పంపేశాడని, తాను మాత్రం ఇంకా 15 నిమిషాలే ఉంది…ప్రభాస్ తో ఉంటే కష్టమే రండి అని తాను వెళ్లిపోయి క్యూలో నిల్చుంటే…తీరిగ్గా వచ్చిన ప్రభాస్…చెప్పానా? ముందే వస్తే లైన్ లో క్యూలో నిల్చోవాలని’ అన్నాడని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. అంత రాయల్ గా, దర్జాగా ప్రభాస్ ఉంటాడని ఆయన చెప్పారు.