బాహుబలి.. బాహుబలి.. ఈ పదమే సినీ జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఏప్రిల్ 28వ తారీఖున విడుదలయే ఈ సినిమా రెండో పార్ట్ కోసం భాషలలో సంబంధం లేకుండా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్, అమెరికా, కెనడా, చైనా, జర్మనీ.. వంటి దేశాల్లోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో యూఏఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, యూఏఈ, యూకే, ఇండియా సినీ విశ్లేషకుడు అయిన ఉమైర్ సంధు.. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఏప్రిల్ 17న చేసిన ట్వీట్ బాహుబలి-2 సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
బాహుబలి-1 కంటే బాహుబలి-2 సినిమా వందరెట్లు బాగుంటుందని.. సినిమా ఫలితంపై సినీవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు, ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని ఉమైర్ సందు చెబుతున్నారు. ఉమైర్ సంధు చెప్పిన మాటలే కనుక నిజమైతే.. భారత సినీ చరిత్రలో బాహుబలి ఒక మైలురాయిగా మిగిలిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.