మొక్కలు నాటిన ఎంపీ లింగయ్య యాదవ్…

310
badugula lingaiah yadav
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు ..రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా తన జన్మదిన సందర్బంగా మొక్కలు నాటారు బడుగుల లింగయ్య యాదవ్.

ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని సంతోష్ గారు చేపట్టిన ఇంత మంచి కార్యక్రమం లో నేను కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పుడున్న వాతావరణం హెచ్చుతగ్గుదలను సమతుల్యం చేయడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో దోహపడుతుంది అని ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిచారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని మరో ముగ్గురుకి రాజ్యసభ సభ్యులు ఎంపీ సురేష్ రెడ్డి గారు , ఎమల్యే రవీందర్ నాయక్ దేవరకొండ గారు , ఎమ్మేల్యే శానంపుడి సైదిరెడ్డి గార్లను మొక్కలు నాటాల్సిందిగా కోరారు.

- Advertisement -