బద్రి రీ-రిలీజ్..ఎప్పుడంటే.!

47
- Advertisement -

తెలుగులో వరుసగా రీ-రిలీజ్ సినిమాల పండగ కొనసాగుతున్న వేళ…పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కు ఒక గుడ్‌ న్యూస్. రీ రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేస్తూ రికార్డు స్థాయిలో వసూలు చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఖుషి సినిమా రీరిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ హిట్ అందుకుంది. ఏకంగా ఈ సినిమాకు ప్రక్షకులే గాకుండా స్టార్స్‌ కూడా క్యూలో నిలబడి టికెట్‌ కొని మరీ సినిమాను ఎంజాయ్‌ చేశారు. ప్రేక్షకులు ఒక సారి చూసిన సినిమాను మళ్లీ థియేటర్‌లో చూడటం అంటే తనదైన మేనరిజంతో అభిమానులకు మరోసారి కిక్కిస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాన్‌ నటించిన బద్రి సినిమా త్వరలో రీరిలీజ్ చేయనున్నారు.

పూరీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ బద్రి అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సమయంలో వచ్చిన లవ్ సినిమాలో బద్రి సినిమా టాప్‌లో నిలిచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈసినిమాతో పవన్ తన కెరీర్‌లో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న భారీ ఎత్తున రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించగా, రమణ గోగుల ఈ చిత్రానికి సూపర్బ్ మ్యూజిక్‌ను అందించాడు. మరీ వేచి చూడాలి రీరిలీజ్‌కు బాక్సాఫీస్ వసూలు ఏ స్థాయిలో రాబడుతోంది చూడాలి.

ఇవి కూడా చదవండి…

పవన్‌ సెంటిమెంట్‌ కు బలైన హీరోయిన్లు వీరే..

కస్టడీ చివరి షెడ్యూల్ ప్రారంభం

మహేష్ సినిమా పై కొత్త ముచ్చట్లు

- Advertisement -