- Advertisement -
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కాషాయ కండువ కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ నేతలు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సైనా బీజేపీలో చేరుతున్నారన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. హర్యానాకు చెందిన సైనా బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్రవేసింది.
కెరీర్‌లో 24కి పైగా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్న సైనా 2009లో వరల్డ్ నంబర్ 2,2015లో వరల్డ్ నంబర్ 1 ఛాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతోంది సైనా.
ఇప్పటికే ప్రముఖ క్రీడాకారులు గౌతమ్ గంభీర్, బబితా ఫొగట్ బీజేపీలో స్టార్ క్యాంపెయినర్లుగా ఉండగా తాజాగా సైనా బీజేపీలో చేరారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -