కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథ ముగిసిందా ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందా ? దాంతో కాంగ్రెస్ లోని ఒక వర్గం ఆయనను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తుందా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా బలంగా ఉండేది. 2009 నుంచి 2018 వరకు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా బలమైన నేతలుగా ఉంటూ వచ్చారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరిన తరువాత వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఒంటరయ్యారు. కాంగ్రెస్ ను వీడలేక వేరే పార్టీలో చేరలేక తెగ ఆపసోపాలు పడ్డారు. .
ముఖ్యంగా మునుగోడు బైపోల్ టైమ్ లో తమ్ముడి కోసం సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించారని అధిస్థానం గుర్రుగా ఉంటూ వచ్చింది. ఆ టైమ్ లో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దాంతో సొంత పార్టీ నేతలే ఆయనను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మాత్రం పార్టీ విడలేదు. బ్రదర్స్ ఇద్దరు చెరో దారి చూసుకోవడంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరి హవా కూడా తగ్గుతూ వచ్చింది. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఎన్నికల కమిటీలలో ఆయనకు స్థానం కల్పించలేదు.
Also Read:రేవంత్ vs రాహుల్ గాంధీ.. హస్తంలో నయా లొల్లి!
మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాను సూచించిన వారికే టికెట్ల కేటాయింపు అని వెంకటరెడ్డి చెబుతున్నప్పటికి.. సొంత పార్టీలోనే అంటలేదు అనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నల్గొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవసరమైతే తాను సీటు త్యాగం చేయడానికి సిద్దంగా ఉన్నానంటూ ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో ఆయనకు గెలుపు విషయంలో ధీమా లేనందువల్లే సీటు త్యాగం చేయడానికి రెడీ అవుతున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దాంతో అటు అధిష్టానం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రదాన్యం ఇవ్వకుండా అధిస్థానం వైఖరి ఇలాగే కొనసాగితే హస్తం పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ముగిసినట్లేనని కొందరు రాజకీయ వాదులు చెబుతున్నారు.
Also Read:ఓటీటీలో దూసుకెళ్తున్న..’ఓ సాథియా’