ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!

116
prabhas
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌. సాహో తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కు సర్జరీ జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్ర షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడట.

దీంతో బార్సిలోనాలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఆపరేషన్ అయినప్పటికీ, డాక్టర్ తదుపరి చెకప్ వరకు ప్రభాస్ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. ప్రభాస్ సర్జరీ గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.

సలార్‌తో పాటు ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కే’, ‘స్పిరిట్’తో పాటు మారుతీ దర్శకత్వంలో ఓ సినిమాను లైన్లో పెట్టాడు ప్రభాస్‌.

- Advertisement -