త్రివిక్రమ్ తో సినిమా.. కష్టమేనా?

33
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ” గుంటూరు కారం “. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీలో మహేశ్ పర్ఫామెన్స్ సూపర్ గా ఉన్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడం, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మూవీలో మిస్ కావడంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. పైగా థమన్ సమకూర్చిన బాణీలు కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే గుంటూరు కారం మూవీ విషయంలో ప్రధానంగా త్రివిక్రమ్ పై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్క్రీన్ ప్లే, కథ అన్నీ తన గత చిత్రాల నుంచి తీసుకొని రూపొందించరాని, అసలు త్రివిక్రమ్ స్థాయి మూవీనే కాదని కొట్టి పడేస్తున్నారు. దీంతో

గుంటూరు కారం రిజల్ట్ కారణంగా త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే మూవీ పై సందిగ్ధత నెలకొంది. మహేశ్ మూవీ తరువాత అల్లు అర్జున్ తో మూవీని అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం రిజల్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో మూవీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీతో బిజీగా ఉన్న బన్నీ ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి సందీప్ వంగా తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంటపురంలో మూవీ ఇండస్ట్రీ ( నాన్ బాహుబలి ) గా నిలిచింది. మరి తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో త్రివిక్రమ్ తో మూవీ చేసేందుకు సిద్దమౌతాడా ? లేదా గుంటూరు కారం రిజల్ట్ తో త్రివిక్రమ్ ను పక్కన పెట్టేస్టాడా అనేది చూడాలి.

Also Read:తలనొప్పిలో ఈ లక్షణాలుంటే.. ప్రమాదమే!

- Advertisement -