‘సాహో’.. బ్యాడ్ బాయ్ సాంగ్.. వీడియో

389
prabhas
- Advertisement -

సుజిత్ దర్శకుడిగా ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ‘సాహో’ ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, ప్రభాస్ సరసన నాయికగా శ్రద్ధా కపూర్ నటించింది.

SAAHO

తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. కన్నడ.. హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అంతకంతకూ అంచనాలు పెంచేస్తూ వెళుతోంది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరుపుకుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘బ్యాడ్ బాయ్’ అంటూ సాగే సాంగును విడుదల చేశారు. ప్రభాస్.. జాక్విలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్‌పై చిత్రీకరించిన ఈ పాట యూత్‌కి యమ కిక్‌ ఇచ్చేలావుంది. ఈ సాంగ్‌లో ప్రభాస్ చాలా స్టైలీష్‌గా కనిపిస్తూ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

- Advertisement -