బ్యాక్ టూ కాంగ్రెస్ ?

59
- Advertisement -

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పెరిగింది. నిన్న మొన్నటి వరకు అంతర్గత విభేదాలతో సతమతమైన టీ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇదే జోష్ ను రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని చూస్తున్నారు హస్తం నేతలు. మరోవైపు కాంగ్రెస్ పనైపోయిందని పార్టీ విడిచిన నేతలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమౌతున్నారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.

ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి వంటి వాళ్ళు బ్యాక్ టూ కాంగ్రెస్ అంటున్నారట. దీంతో హస్తం పార్టీకి పూర్వ వైభవం వస్తోందని ఆ పార్టీ నేతలు సంబరపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ వీడిన వారు తిరిగి రావాలని, వివేక్, కొండ విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేంద్ర వంటివాళ్లు కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ రెడ్డి కోరారు. తన మీద కోపంతో పార్టీ వీడిన వాళ్ళు తిరిగి రావాలని, ప్రజల కోసం పార్టీ కోసం తాను పది మెట్లు దిగడానికైనా సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: CM KCR:మళ్లీ అధికారం మనదే

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరియు ఈటెల రాజేందర్ వంటి పార్టీ మారడంపై స్పందించారు. బీజేపీని వీడే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లైంది. అయితే కర్నాటక ఇచ్చిన జోష్ తో టీ కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నప్పటికి.. ఎంతవరకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయనేది ఆసక్తికరమే. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలస వెళ్ళిన నేతలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. దీంతో పలువురు నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

- Advertisement -