వరుణ్ ధావన్‌…’బేబీ జాన్’

1
- Advertisement -

వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో చేస్తున్న సెన్సేషనల్ మూవీ ‘బేబీ జాన్’. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీ, జియో స్టూడియోస్ A ఫర్ Apple, Cine1 స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ టేస్టర్ కట్ రిలీజ్ అయ్యింది.

కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దాదాపు రెండు నిమిషాల టీజర్, చీమల గుంపు ఏనుగును ఎలా ఓడించగలవో ఓ యంగ్ గర్ల్ చెప్పే మెస్మరైజ్ కథనంతో ప్రారంభమైయింది. ఈ మెటాఫర్ వరుణ్ క్యారెక్టర్ బేబీ జాన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. టీజర్‌ వరుణ్ ను ఫెరోషియస్ పోలీసుగా, ప్రేమగల తండ్రిగా, యాక్షన్ హీరోగా, నైపుణ్యం కలిగిన వంటవాడిగా ఇలా మల్టీషేడ్స్ లో ప్రజెంట్ చేసింది. బ్రెత్ టేకింగ్ విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వరుణ్ అద్భుతమైన స్లో-మోషన్ స్టంట్స్ ప్రేక్షకులను మరింత ఆసక్తిని కలిగించాయి. ఈ టేస్టర్ కట్‌తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

వరుణ్‌తో పాటు ఇందులో కీర్తి సురేష్, వామికా గబ్బి కీలక పాత్రలలో నటించారు, లెజెండరీ జాకీ ష్రాఫ్ విలన్ పాత్రను పోషించారు. A ఫర్ Apple స్టూడియోస్, Cine1 స్టూడియోస్ పై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. థమన్ మ్యూజిక్ స్కోర్ మరింత ఉత్కంఠను పెంచుతుంది. అట్లీ , Jio స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం డిసెంబర్ 25, 2024న థియేటర్లలోకి రానుంది.

Also Read:ఉగాండాలో పిడుగుపాటు…14 మంది మృతి

- Advertisement -