పాన్‌లో విషం ఇచ్చి చంపేందుకు ప్ర‌య‌త్నించారు!

75
- Advertisement -

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు న‌టుడు బాబు మోహ‌న్. సినిమాల‌కు దూర‌మైన రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసి ముందుకుసాగుతున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

ఢిల్లీలో శ్రీకాంత్ ‘వన్స్‌మోర్‌’ సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. ఆ సమయంలో సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్‌ తింటున్నాడు. నన్ను కూడా తినమని నాకు కూడా పాన్ అలవాటు చేశాడు. ఆ తర్వాత ఒకానొక టైంలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్‌లు తిన్నానని తెలిపాడు.

ఇక సంగారెడ్డిలో పాన్ ఫేమ‌స్..అక్క‌డి నుండి తెప్పించుకోని తినేవాడిన‌ని తెలిపారు. ఇది తెలిసిన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఓసారి పాన్ లో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్‌ తీసుకుని కారులో వెళ్ళేటప్పుడు తిందామనుకునే సమయానికి ఎవరో ఫోన్ చేసి దయచేసి పాన్‌ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. అప్పుడు తెలిసింది రాజకీయాలు ఇంత ప్రమాదక‌ర‌మోన‌ని వెల్ల‌డించారు.

- Advertisement -