ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబు మోహ‌న్‌

22
- Advertisement -

తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ని నియమించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మీడియాతో మాట్లాడిన ఆయన..వరంగల్ పార్లమెంట్ నుండి బాబు మోహన్ బరిలో ఉంటారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదన్నారు పాల్.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఏక్ నాథ్ షిండేలు సిద్ధంగా ఉన్నారని వారి పేర్లు బయటకు చెప్పనన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో జనానికి మంచినీళ్లు ఇవ్వలేక పోయారని..అప్పుల ఊబిలో రేవంత్ సర్కార్ కూరుకుపోయిందన్నారు. గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తెచ్చింది తానేనని… అది చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కేఏ పాల్ కు ధన్యవాదాలు తెలిపారు బాబు మోహన్‌.

Also Read:హోళీ సెలెబ్రేషన్స్‌లో ‘ఫ్యామిలీ స్టార్’ టీం

- Advertisement -