కుట్రలకు.. కుతంత్రాలకు కేరాఫ్ అడ్రగా నిలిచే చంద్రబాబు మరోసారి నీచ రాజకీయానికి పూనుకున్నాడు. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని ఉబలాటపడుతున్న చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీతో మిలాఖత్ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పార్టీని, చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. అయినా తన బుద్ధిని ఏమాత్రం మార్చుకోకుండా మరోసారి తెలంగాణపై కుట్రల కత్తులు కట్టి మరోసారి విషం చిమ్మాలని చూస్తూన్నాడు.
కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతూ అపవిత్ర పొత్తుల రాజకీయం చేస్తూ మహాకూటమి ముసుగులో తెలంగాణపై దండయాత్ర చేయాలని చూస్తున్నాడు. ఐదేళ్ల కాలంలోనే చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ భిన్న ధృవాలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలతో అంటకాగాడు. ఇప్పుడు మరోసారి తన కపట బుద్ధితో దేశ రక్షణ ముసుగులో కొత్తనాటకానికి తెరలేపారు. మాటలతో ఎదురుదాడి చేసి తనపై ఉన్న అన్ని కేసుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌తో జట్టుకట్టాడు పచ్చపార్టీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నం లేదు.
తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ప్రభుత్వం కీలక శాఖలైన భారీ నీటిపారుదల, హోం శాఖలను తన గుప్పిట్లో పెట్టుకుని, నీళ్లను మలుపుకుని, తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి బయటపడాలని ప్లాన్ వేసుకున్నాడట. మొత్తానికి చంద్రబాబు తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవాలనుకుంటున్నాడు. చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసైనా తెలంగాణలో తన ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఆడుతున్న కపట నాటకాలను గమనిస్తూనే ఉన్నారు. మహాకూటమి ముసుగులో తెలంగాణలో తిరగాలంటున్న బాబుకు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది.