Chandrababu: జగన్ పాలనలో విధ్వంసం,అక్రమార్కులకు శిక్ష తప్పదు

7
- Advertisement -

ఏపీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు, జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

గత ఐదేళ్లలో మసకబారిన రాష్ట్ర ప్రతిష్ఠను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలుగు నేల గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను తొలగించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము నేటినుంచి 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. జీవనాడి పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు. పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 1న తొలిరోజే 97 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని తెలిపారు.

గత ప్రభుత్వ పాలనలో ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూములను దోచుకున్నారని …నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు జరిపిస్తామని, అక్రమార్కులను శిక్షించి తీరతామని అన్నారు.

Also Read:Revanth Reddy: ప్రజా సంక్షేమమే మా ధ్యేయం

- Advertisement -