కుట్ర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు..

280
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ పాలన, ఆయన ప్రవేశపెట్టే పథకాలు, రైతులకోసం సంక్షేమ పథకాలు,ఇలాంటి ఎన్నో మంచి పనులతో తెలంగాణ బాపు కేసీఆర్‌.. రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తూ.. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు. అయితే తెలంగాణ కోసం ఎంతో శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ విదివిధానాలు మెచ్చి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల నుండి ముఖ్య నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొగాలు విశ్వేశ్వర్, బాబుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..తెలంగాణ పథకాలను చంద్రబాబు నాయుడు కాపీకొట్టి పేర్లు మార్చి ఏపీలో ప్రవేశపెడుతున్నారని విమర్శించారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. మేమేదో కుట్రలు చేస్తున్నామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలపై బాబుకే అన్ని హక్కులు ఆన్నాయని ఎద్దేవాచేశారు. కేసీఆర్ చక్రవర్తా కాదా అనేది ప్రజలు తేల్చిచెప్పారన్నారు. కేసీఆర్‌ను అశోకచక్రవరిగా, చంద్రబాబు నీరోచక్రవర్తిగా అభివర్ణించారు. చంద్రబాబును ఓడించడానికి ఏపీ ప్రజలే సిద్ధంగా ఉన్నారని కేటీఆర్‌ అన్నారు.

ktr news

ఇద్దరే ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, 16 ఎంపీ స్థానాల్లో తెరాసను గెలిపిస్తే దిల్లీని గడగడలాడిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన పోవాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, బాబును ఓడిస్తేనే జాబు వస్తుందని అక్కడి యువత భావిస్తోందని పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్సని తెలిపారు. ‘‘పాలమూరు జిల్లా ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పాలమూరులో 14కి 13 మంది తెరాస ఎమ్మెల్యేలను గెలిపించారు.

ఈ దేశం మోడీ, రాహుల్ గాంధీల జాగీర్ కాదు. అని ,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వంద స్థానాలు ,భాజపాకు 150 దాటవు. ఆ రెండు పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు అని కేటీఆర్‌ తెలిపారు. పాము, ముంగిసలా ఉండే చంద్రబాబు, రాహుల్ గాంధీ .మొన్నటి ఎన్నికల్లో ఒక్కటయ్యారు. ప్రజాకూటమి పేరుతో తెలంగాణలో హడావుడి చేశారు. అయినా తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మమ్మల్ని తిడుతూనే అందరూ మన తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు. రైతు బంధు పథకం మంచిదని అర్థమై ప్రధాన మంత్రి ఆ పథకాన్ని కాపీ కొట్టగా, చంద్రబాబునాయుడు కూడా అదే పని చేశారు.

చంద్రబాబు, కేసీఆర్లకు నక్కకు..నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే, బాబు మామ పెట్టిన పార్టీని గుంజుకున్నారు. ఎవరితో ఒకరితో పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరు. కేసీఆర్ చక్రవర్తిలా పాలిస్తున్నారని బాబు అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అవును కేసీఆర్ మొక్కలు నాటిన అశోక చక్రవర్తిలా పాలిస్తున్నారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

(కరీంనగర్‌ నుండే ఎన్నికల శంఖారావం..https://goo.gl/jPG9bi)

- Advertisement -