మీరు చేస్తే కరెక్ట్..వేరేవాళ్లు చేస్తే తప్పా?: బాబు గోగినేని

82
babu
- Advertisement -

హీరో విశ్వక్ సేన్ – టీవీ 9 యాంకర్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వివాదానికి మూలమైన ఆ ప్రాంక్ వీడియో, అందులో పెట్రోల్ వాడినట్టుగా అందరూ భ్రమించడం, దాంతో న్యూసెన్స్ కేసు నమోదవ్వడం, అది కాస్తా టీవీ 9 డిబెట్ వరకు రావడం జరిగింది.

దీనిపై టీవీ 9 రచ్చ చేస్తుండగా తాజాగా బాబు గోగినేని ఓ పాత వీడియోను షేర్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. పెట్రోల్ అంటూ గతంలో టీవీ 9 చేసిన ప్రాంక్ వీడియోను షేర్ చేశారు. ‘ఫ్లాష్- ఫ్లాష్- ఫ్లాష్.. ‘మా అన్నొత్తేనే ఉంటా లేకపోతే నేను ఉండను!’ అని నీళ్లతో నిండిన పెట్రోల్ క్యాన్ పట్టుకుని రోడ్డు పక్కన సూసైడ్ ప్రాంక్ స్కిట్ చేస్తున్న మిత్రులు. స్కిట్ ను టీవీ9 సరదాగా ప్రసారం చేసిన దృశ్యాలు. అప్పుడు ఎవరికీ ఇది సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ కాకపోవడం ఒక కొసమెరుపు.

విశ్వక్ సేన్ చేసింది ఇదేనా? అఫ్ కోర్స్ ఇదీ స్టుపిడ్‌నే అదీ స్టుపిడ్‌నే. కానీ ఒకటి కరెక్టే, రెండోది కాదు అనడం నిజాయితీనా?కానివ్వండి, వీడియోలు డిలీట్ చేసినవాడిదే రాజ్యం అంటూ సెటైర్లు వేశారు.

- Advertisement -