ఏపీ సీఎం చంద్రబాబు ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు.. గిరిజన సంప్రదాయం కొమ్మకోయ దరించి డ్యాన్స్ చేయడమే కాదు వారితో కలిసి డప్పు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అరకు కాపీ ఉత్పత్తులను పరిశీలించారు. చంద్రబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు అరకు కాఫీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ముఖ్యమంత్రి.#NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/XEK06av0c8
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
Also Read:తెలంగాణ బీజేపీ..ఎవరి దారి వారిదే?